అన్నమయ్య: బాపట్ల జిల్లాలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు ఘనంగా జరిగాయి. ఈ నెల 10న ప్రారంభమైన పోటీలలో, రైల్వేకోడూరుకు చెందిన విద్యార్థి టి. సోహిత అండర్-14 విభాగంలో బంగారు పతకం సాధించింది. ఆమె ఉత్తమ ప్రతిభ కనబరిచి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైందని ఎస్. కె స్పోర్ట్స్ అకాడమీ కోచ్ మౌల తెలిపారు. ఈ విజయం క్రీడాకారిణి పలువురు అభినందించారు.