KMM: ఫీజు రియంబర్మెంట్స్ సమస్యలను మంత్రి వర్గ క్యాబినెట్లో చర్చించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత ప్రభుత్వం చేసిన బకాయిల వలన ఈ ప్రభుత్వం పెద్ద మొత్తంలో అప్పులు చెల్లించవలసిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. విద్యార్థులు భవిష్యత్తు కోసం సీఎం నిధులు విడుదల చేస్తారని తెలిపారు. విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.