NZB: సిరికొండ మండలంలోని జంగిలోడి తండా, రావుట్ల గ్రామాల్లో ఐడీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను డీసీసీ సెక్రటరీ గొల్ల ఎర్రన్న సోమవారం ప్రారంభించారు. దళారులను ఆశ్రయించి మోసపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి లాభాలు పొందాలని ఆయన సూచించారు.