AP: మాజీమంత్రి దామోదర్ రెడ్డి మృతిపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దామోదర్ రెడ్డి మృతి బాధాకరమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కాగా, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డి HYDలోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.