VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో వరాహ లక్ష్మీనరసింహస్వామి నిత్య కళ్యాణం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో చెప్పి శ్రీకారం చుట్టారు. జీలకర్ర, బెల్లం,మాంగళ్య ధారణ ప్రక్రియలను కమనీయంగా నిర్వహించారు. భక్తులకు వేద ఆశీర్వచనం అందజేశారు.