MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలో రాజగోపురం వద్ద వన దుర్గ భవాని మాతకు ఏకాదశి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాద్రపదం మాసం, కృష్ణపక్షం, సౌమ్యవాసరే పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర జలంతో అభిషేకం చేశారు, పట్టు వస్త్రాలు పలు ద్రవ్యాలు సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించి మహా మంగళ హారతి నైవేద్యం నివేదన చేశామని ప్రధాన అర్చకులు శంకర్ శర్మ తెలిపారు.