WGL: జిల్లా సంగెం మండలానికి చెందిన బొల్లబోయిన రాజేందర్‌ను జాతీయ మానవ హక్కుల కమిటీ మండల ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు మెరుగు రాంబాబు, కార్యదర్శి రమేష్‌లకు ధన్యవాదాలు తెలిపారు.