AP: తిరుపతిలో అన్ని సౌకర్యాలతో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఒకేసారి 150 బస్సులు నిలిపి ఉంచేలా ‘బస్ బే’ ఉండాలని తెలిపారు. హెలిప్యాడ్, మాల్స్, రోప్ వే, మల్టీప్లెక్స్లతో డిజైన్లు ఉండాలని చెప్పారు. భవిష్యత్తులో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే నడుపుతామని.. ప్రతి బస్సుకూ ఛార్జింగ్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు.