»Temperatures Are Increasing Drastically In Ap Alert For People Of These Areas
Ap Weather : ఏపీలో భారీగా పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు..ఈ ప్రాంతాల వారికి అలర్ట్
ఏపీ(Ap)లో ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే చాలా మంది భయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండలాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ(Weather Department) తెలిపింది. తాజాగా భారత వాతావరణ కేంద్రం ఏపీ ప్రజలకు అలర్ట్(Alert) జారీ చేసింది.
ఏపీ(Ap)లో ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే చాలా మంది భయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండలాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ(Weather Department) తెలిపింది. తాజాగా భారత వాతావరణ కేంద్రం ఏపీ ప్రజలకు అలర్ట్(Alert) జారీ చేసింది. శనివారం రాష్ట్రంలోని 12 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఏపీ(Ap) వ్యాప్తంగా 115 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని, ఆదివారం కూడా 65 మండలాల్లో వడగాల్పులు(Hail) వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ నుంచి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7, అనకాపల్లిలో 13, తూర్పుగోదావరిలో 10, ఏలూరులో 1, గుంటూరులో6, కాకినాడలో 16, కోనసీమలో 6, కృష్ణాలో 2, ఎన్టీఆర్ జిల్లాల్లో 4, పల్నాడులో 3, పార్వతీపురంమన్యంలో 7, శ్రీకాకుళంలో 13, విశాఖపట్నంలో 3, విజయనగరంలో 24 మండలాల్లో వడగాల్పులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అనకాపల్లిలో 10, కాకినాడ 2, ఎన్టీఆర్ 1 మండలంలో తీవ్రవడగాల్పులు, 67 మండలాల్లో వడగాల్పులు శుక్రవారం నమోదైనట్లుగా విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ వాతావరణ శాఖ(Weather Department) తెలిపింది.