IPL 2023 : టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్(IPL) సీజన్ 2023లో భాగంగా శనివారం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) తలపడనున్నాయి. ఈ రసవత్తర మ్యాచ్ గువాహటి వేదికగా జరుగుతోంది. మ్యాచ్‌లో భాగంగా మొదట ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచింది. టాస్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకోవడంతో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేయనుంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకూ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్టు ఓడింది. దీంతో ఈ మ్యాచ్ లో ఎలాగైనా సరే గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగింది.

ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) రెగ్యులర్ కెప్టెన్ అయిన రిషబ్ పంత్ ప్రమాదం కారణంగా కోలుకుంటున్నాడు. దీంతో అతడి స్థానంలో సారధిగా డేవిడ్ వార్నర్ వ్యవహరిస్తున్నాడు. అయితే జట్టులోనూ, ఆట తీరులోనూ డేవిడ్ వార్నర్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడే టాక్ వినిపిస్తోంది. అటు కెప్టెన్సీ పరంగానూ డేవిడ్ వార్నర్ ఘోరంగా విఫలం అవుతూ వస్తున్నాడు. ఆటగాడిగానూ అతను ఏమాత్రం సరిగ్గా ఆడటం లేదు.
ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్టులో ప్రస్తుతం కీలక ఆటగాళ్లు కూడా ఫామ్‌లో లేకపోవడంతో ఢిల్లీ జట్టు వెనకబడుతోంది. ఇదే కొనసాగితే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇంటికి వెళ్లడం ఖాయం. రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పలు మార్పులు చేసింది. ఆల్ రౌండర్ అయిన మిచెల్ మార్ష్ స్థానంలో రోవ్ మాన్ పావెల్‌ను జట్టులోకి తీసుకుంది. ఆ తర్వాత సర్పరాజ్ ఖాన్ స్థానంలో లలిత్‌కు చోటును కల్పించింది. మనీశ్ పాండేను కూడా మళ్లీ జట్టులోకి తీసుకుంది.
ఈ రోజు మరో రెండు కీలక జట్లు అయిన ముంబై ఇండియన్స్(Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్(Chennai super kings) జట్టు కూడా పోటీ పడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు ఆ మ్యాచ్ ప్రారంభం కానుంది. వీకెండ్ కారణంగా ఐపీఎల్(IPL) ప్రియులకు ఈ రోజు సందడి వాతావరణం కనిపిస్తోంది. రెండు మ్యాచ్ లు ఉండటంతో తమ ఫేవరెట్ జట్టు గెలుస్తుందో లేదోనని ఉత్కంఠగా అభిమానులు టీవీలకు అతుక్కుపోయి ఎదురుచూస్తున్నారు.