KDP: దిక్కు మొక్కులేని అనాథలను ఆదుకుని, వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న వివేకానంద సేవాశ్రమాన్నికి కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్డీ విజయ జ్యోతి 22 వేల రూపాయల విలువగల 18 రేకులను వితరణ చేశారు. సేవాశ్రమం వార్షికోత్సవం పురస్కరించుకుని చేపట్టిన పనుల్లో భాగంగా తన వంతు సాయం చేశానని శుక్రవారం సాయంత్రం విజయ జ్యోతి పేర్కొన్నారు.