MDK: తూప్రాన్ హైవే బైపాస్ లో అనుమతి లేకుండా తరగతి నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకుంటున్నట్లు మండల విద్యాధికారి డాక్టర్ పర్వతి సత్యనారాయణ తెలిపారు. అనుమతి లేకుండా తొమ్మిదవ తరగతి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థులకు యూనిఫామ్ అమ్మకం చేస్తుండడంతో యూనిఫామ్ అమ్మకం గదిని సీజ్ చేసినట్లు తెలిపారు