HNK: జిల్లా కేంద్రంలోని అలంకార్ జంక్షన్ 11వ డివిజన్లో గురువారం ఆరె కటిక గురువు శ్రీ ధర్మ వ్యాదుడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ ఎంపీ కడియం కావ్య హాజరై, విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆరె కటికల సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.