KMM: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ , ఫీజు రీయింబర్స్మెంట్ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు అన్నారు. విద్యారంగ సమస్యలపై జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.