కృష్ణా: సమాజంలో గురువు పాత్ర సమున్నతం అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం నాగాయలంక మండలం భావదేవరపల్లిలోని శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో గురు పూర్ణిమ పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ విచ్చేసి బాబాకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనను ఆలయ పెద్దలు ఘనంగా సత్కరించారు.