VSP: అన్నదాత సుఖీభవ పథకం అర్హుల జాబితా సచివాలయాలలో అందుబాటులో ఉందని గురువారం ఏవో ఏం ఫణిరాజ్ వర్మ తెలిపారు. కావున రైతులు సచివాలయాలకు వెళ్లి తమ పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని సూచించారు. పథకం పొందేందుకు అర్హత ఉండి లిస్ట్‌లో పేరు లేకపోతే గ్రామ వ్యవసాయ సహాయకులను కాని లేదా గ్రామ ఉద్యానవన సహాయకులను కాని సంప్రదించాలని ఏవో తెలియజేశారు.