GNTR: పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలోని నం.1 రేషన్ దుకాణంపై గురువారం విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. దుకాణంలో 1800 కేజీల అధిక బియ్యం నిల్వగా ఉన్నట్లు గుర్తించి, రేషన్ డీలర్‌పై 6-ఏ కేసు నమోదు చేశారు. అదనపు స్టాక్‌ను మరో రేషన్ డీలర్‌కు అప్పగించారు.