NTR: విజయవాడకు చెందిన జ్యోతిబసు తాను చనిపోయి కూడా మరికొందరికి ప్రాణదానం చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జ్యోతిబసు చికిత్స పొందుతున్నారు. అయితే బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవ దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా గురువారం గ్రీన్ ఛానల్ ద్వారా జ్యోతిబసు అవయవాలు వివిధ ప్రాంతాలకు తరలించారు.