ప్రకాశం: పొదిలి మండలంలోని కంభాలపాడు – జఫ్లాపురం రోడ్డు మార్గాన ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించాలని వాహనదారులు కోరారు. నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, ఆటోలు, బైకులు ఆ దారిగుండా తిరుగుతుంటాయి. రోడ్డుకు ఇరువైపులా చెట్లు ఉండడంతో ఎదురు వచ్చే వాహనాలు కనపడక ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడాల్సిన పరిస్థితి ఉందని, అధికారులు స్పందించి చెట్లను తొలగించాలని కోరారు.