HYD: ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో పిల్లల సేఫ్టీ, తదితర అంశాలపై మాదాపూర్ డీసీపీ వినీత్ పాఠశాలలకు, స్థానిక పోలీసులకు పలు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే పాఠశాలల్లో సేఫ్టీ క్లబ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పిల్లల సేఫ్టీ కోసం సరైన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రోడ్డు పక్కనే ఉన్న పాఠశాలల వద్ద చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు.