HNK: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శనివారం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమ కేసు నమోదు చేయించి అరెస్టు చేయించారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి రాష్ట్రానికి రాగానే పోలీసులు అదుపులోకి తీసుకోవడం బాధాకరమన్నారు.