WGL: హుజురాబాద్ MLA పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ ఎయిర్పోర్టులో వరంగల్ పోలీసులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను కోర్టులో ప్రవేశపెట్టగా.. కాజీపేటలోని రైల్వే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో బీఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు.