మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు (Osmania Hospital) తరలించారు. పాతకక్షలే కాల్పులకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. దుండగులను గుర్తించేందుకు సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలంలో గన్ తో పాటు కత్తులు కూడా దొరికినట్లు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ కిరణ్ (DCP Kiran) వెల్లడించారు. కాల్పులు జరిపిన వెంటనే క్రాంతి, అతని అనుచరులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే టప్పాచబుత్ర పోలీసులు (Tappachabutra Police) సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు డీసీపీ చెప్పారు.