ATP: ఈనెల 27 నుంచి 31 వరకు జరిగే వినాయక ఉత్సవాల్లో మండపాల్లో మట్టి గణపతుల విగ్రహాలకు మాత్రమే అనుమతి ఉంటుందని జేసీ శివనారాయణ శర్మ తెలిపారు. పీఓపీ, రసాయన రంగుల విగ్రహాలకు నిషేధం విధించారు. ఉత్సవాల కోసం పోలీసు, అగ్నిమాపక, మున్సిపల్, పంచాయతీ అధికారుల అనుమతి తప్పనిసరని. పెద్ద విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.