HYD: ఫిలింనగర్ దైవ సన్నిధానంలో సోమవారం వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేకువ జామునే పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు, హోమం జరిపించారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌఖ్యాలు లభిస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.