SKLM: పాతపట్నంలో కొలువైన ఉన్న శ్రీ నీలమణి దుర్గ అమ్మవారు ఆదివారం ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చారు. ఆదివారం కావడంతో అమ్మవారిని పూలమాలలు, పట్టు వస్త్రాలు, వెండి ఆభరణాలతో అలంకరించామని ఆలయ అర్చకులు రాజేష్ తెలిపారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఆంధ్ర, ఒడిస్సా రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారని ఆలయ ఈవో వాసుదేవరావు తెలిపారు.