NDL: డోన్ మండలం కనపకుంట గ్రామంలో శనివారం మద్దిలేటి స్వామి తిరుణాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం జరిగిన ఎద్దుల బండలాగు పోటీలను లక్కసాగరం లక్ష్మీ రెడ్డి ప్రారంభించారు. గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.