ప్రకాశం: వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం మన ఆర్మీకి రక్షణ వ్యవస్థకు మద్దతుగా ఆలయ పాలక మండల సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పహల్గాంలో హిందువులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్పులలో మరణించిన మన భరతమాత ముద్దుబిడ్డలపై జరిగిన ఉగ్రదాడి ప్రతీకారంగా తీర్చుకోవడం సంతోషదాయకమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి అందరూ మద్దతు తెలపాలన్నారు.