KMM: సామాజిక బాధ్యతగా వినాయక చవితి పండుగ రోజున మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కన పెట్టి, పర్యావరణ హిత మట్టి గణపతులకు ప్రాధాన్యమిద్దామని చెప్పారు. మట్టి వినాయకుడినే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.