SRPT: జమ్మూ-కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి అత్యంత హేయమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాజేశ్వరరావు, జిల్లా మహిళ అధ్యక్షురాలు అనురాధ అన్నారు. ఉగ్రవాదుల దుర్మార్గపు చర్యకు నిరసనగా శుక్రవారం సూర్యాపేటలో కొత్త బస్టాండ్ వద్ద కొవ్వొత్తులతో ర్యాలీగా బయలు దేరి నిరసన ప్రదర్శన నిర్వహించారు. కొవ్వొత్తులతో అమరులైన వారి ఆత్మశాంతికి మౌనం పాటించారు.