SRCL: ధాన్యం కొనుగోలు చేయాలంటూ వీర్నపల్లి మండలంకు చెందిన రైతులు గురువారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన చేపట్టారు. వెంటనే ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు.