TG: ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వ్యాపారులు ఆందోళనలు చేపట్టారు. గో బ్యాక్ మార్వాడీ నినాదాలతో నిరసనకు దిగారు. ఆందోళనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసులు వ్యాపారులను అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లో వ్యాపారులు బంద్ పాటిస్తున్నారు. గో బ్యాక్ మార్వాడీ పేరుతో స్వచ్ఛందంగా బంద్ కొనసాగుతోంది.