కృష్ణా: మచిలీపట్నంలో కలెక్టర్ బాలాజీ గృహ నిర్మాణం, కేంద్ర అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. గృహ నిర్మాణాల గడువు వచ్చే మార్చి 31 వరకు పొడిగించినట్లు తెలిపారు. జిల్లాలో 2.36 లక్షల పింఛన్లలో 4,332 అనర్హులైన దివ్యాంగుల పింఛన్లు ఆపివేసినట్లు పేర్కొన్నారు. వాళ్లల్లో అర్హులకు మళ్లీ అందిస్తామని తెలిపారు.