TG: MMTS ఘటన జరిగి రెండు రోజులు గడిచినా నిందితుడిని పట్టుకోలేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఫైర్ అయ్యారు. పల్లా వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. ‘నిందితుడిని అరెస్ట్ చేశాం. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీస్.. నేరస్తులపై ఉక్కుపాదం మోపేలా పోలీసు శాఖలో సంస్కరణలు చేశాం. పోలీసులను రాజకీయాల్లోకి లాగొద్దు’ అని పేర్కొన్నారు.