MNCL: విద్యార్థులు సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని భరోసా టీం కోఆర్డినేటర్ జీవిత సూచించారు. బుధవారం ఆసిఫాబాద్ ZPSSలో విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. సోషల్ మీడియా వేధింపులు, ఈవ్ టీజింగ్, మహిళల అక్రమ రవాణా, సైబర్ మోసాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు.