SKLM: అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు గొట్టాబ్యారేజ్లోకి వరద నీరు చేరుతుండడంతో బ్యారేజ్ 19 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం రాత్రి 7 గంటలకు వంశధార నదిలో 16,808 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుంది. ఎడమ కాలువకు 1,736 క్యూసెక్కుల సాగు నీటిని సరఫరా చేయడం జరుగుతుందని డీఈ సరస్వతి తెలిపారు.