అనకాపల్లి: జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ సూర్యచంద్ర అన్నారు. ఈ మేరకు నాతవరంలో మంగళవారం రాత్రి జనసేన పార్టీ సమావేశం నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలనుసారం అందరు ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ కోసం పని చేస్తున్న ప్రతీ కార్యకర్తకు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.