సత్యసాయి: బత్తలపల్లెలో రూ. 22 లక్షల వ్యయంతో నిర్మించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయాన్ని ఆదివారం మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. కార్యాలయంలోని సదుపాయాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని విద్యుత్ సమస్యల త్వరిత పరిష్కారానికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని తెలిపారు.