KDP: ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించిన మహాపురుషుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని వేంపల్లె అవోపా అధ్యక్షుడు బైరిశెట్టి వెంకట సునీల్ కుమార్ తెలిపారు. వేంపల్లెలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్య అఫీసియల్స్ & ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.