బాపట్ల: జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 471 మంది విద్యార్థులు హాజరు కాలేదని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. జిల్లాలో రెగ్యులర్, ఒకేషనల్ కలిపి 10,679 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. కాగా 10,202 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు. పటిష్ట బందోబస్త్ నడుమ ప్రశాంతంగా పరీక్షలు జరుగుతున్నాయి.