MDK: చేగుంట మండల కేంద్రంలోని సామిల్ (కట్టే కోత)లో ప్రమాదవశాత్తూ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలో ఉన్న యంత్రాలు, రేకుల షెడ్, కట్టెలు కాలి బూడిద అయ్యాయి. సుమారుగా రూ. 20 లక్షల వరకు నష్టం జరిగిందని కట్టే కోత మెషీన్ యజమాని గోవింద్ తెలిపారు. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు.