మేడ్చల్: రాజేంద్రనగర్ సర్కిల్ గగన్ పహాడ్ పారిశ్రామికవాడలో మంగళవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగింది. గగన్ పహాడ్‌లోని ఓ లారీ మెకానిక్ షెడ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించి స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది.