»Viral Video Of Babies Participating In A Crawl Race
Viral video: క్రికెట్, పాలిటిక్స్ కంటే ఇంట్రెస్ట్.. చిన్నారుల రేస్ చూసి నవ్వుకోండి
క్రాల్ రేస్ లో (Crawl Race) పాల్గొన్న చిన్నారులకు సంబంధించిన ఓ వీడియో (Viral Video) మిమ్మల్ని మంత్రముగ్ధులను చేయడం ఖాయం. ఈ వీడియోను 'హస్నా జరూరీ హై' ట్విట్టర్ పేజీ (Twitter Page) ద్వారా షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
క్రాల్ రేస్ లో (Crawl Race) పాల్గొన్న చిన్నారులకు సంబంధించిన ఓ వీడియో (Viral Video) మిమ్మల్ని మంత్రముగ్ధులను చేయడం ఖాయం. ఈ వీడియోను ‘హస్నా జరూరీ హై’ ట్విట్టర్ పేజీ (Twitter Page) ద్వారా షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా (Video viral) మారింది. చిన్న పిల్లల మధ్య జరిగిన ఈ రేసుకు సంబంధించిన వీడియో చూస్తే మీరు కచ్చితంగా నవ్వుతారు. ఉత్తర కాలిఫోర్నియా లోని చాపెల్ హిల్ (Chapel Hill in North California) ప్రాంతంలోని వీడియో ఇది. రెండు నిమిషాల 20 సెకన్ల నిడివి గల వీడియో. క్రాల్ రేస్ కు (crawl race) సంబంధించింది. ఇందులో బాస్కెట్ బాల్ కోర్టులో కొంతమంది చిన్నారులు కనిపిస్తారు. వారి తల్లిదండ్రులు అటు వైపు ఫినిషింగ్ లైన్ (finishing line) వద్ద ఉంటారు. ఫినిషింగ్ లైన్ కు దూరంగా ఉన్న చిన్నారులు రేసుకు సిద్ధమవుతున్నట్లుగా ఉంది.
ఈ రేసు ప్రారంభం కాగానే చిన్నారులు పాకడం (crawling) ప్రారంభిస్తారు. వారు ఫినిషింగ్ లైన్ (finishing line) దిశగా వెళ్తారు. ఈ సీన్ అంతా మన మనసుకు ఆనందాన్ని ఇస్తుంది.. అలాగే ఆ పసిపిల్లల పనికి నవ్వుకుంటారు. ఒక చిన్నారి అయితే అందరి కంటే ముందే ఫినిషింగ్ లైన్ (finishing line) వరకు వెళ్ళినప్పటికీ, ఆ లైన్ ను మాత్రం తాకదు. ఫినిషింగ్ లైన్ వద్ద ఉన్న తమ పేరెంట్స్ ఎంతగా పిలిచినప్పటికీ లైన్ ను మాత్రం టచ్ చేయదు. ఆ తర్వాత రెండో పాప, మూడో పాప కూడా వస్తుంది. మిగతా ఇద్దరు దాదాపు ప్రారంభం కాకముందే లైన్ వద్దకు వచ్చిన చిన్నారు ఎంతకూ లైన్ ను తాకదు. రెండో పాప కూడా లైన్ కు కాస్త దూరంలో ఆగిపోతుంది. పేరెంట్స్ ఎంతగా పిలిచినప్పటికీ వారు లైన్ ను తాకరు. కానీ చివరగా వచ్చిన మూడో పాప వచ్చిన వెంటనే లైన్ ను తాకుతుంది.
జీవితం కూడా ఇలాగే ఉంటుంది అంటూ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసారు. మీరు ఎలా ప్రారంభించారని కాదు… ఎలా ముగించారనేది (It’s not how you START but how you finish), మనసారా నవ్వుకోండి అంటూ పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. రియల్ సెన్స్ ఆఫ్ లైఫ్…. జీవితంలో మనం తరుచూ ఇలాంటి పొరపాట్లు చేస్తుంటామని, అవే మనల్ని విజయానికి దూరం చేస్తుంటాయని, దగ్గరగా వెళ్లి వెనక్కి వచ్చిన సందర్భాలు ఉంటాయని…. ఆ పసి పిల్లల వలె మనకు కూడా ఎక్కడ ప్రారంభం ఎక్కడ పూర్తి అనేది తెలియకుండా ఉందని… నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. క్రికెట్, పాలిటిక్స్ కంటే ఆసక్తిగా ఉన్నాయని మరో నెటిజన్ పేర్కొన్నారు.