కృష్ణా: నూజివీడు మున్సిపల్ వైస్ ఛైర్మన్గా ఎన్నికైన పగడాల సత్యనారాయణను వర్కర్స్ అండ్ టైలర్ అసోసియేషన్ అభినందించింది. పగడాలను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించి అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో పట్టణ అభివృద్ధికి, వృత్తిదారుల పురోభివృద్ధికి కృషి చేయాలని కోరారు. మంత్రి కొలుసు పార్థసారథి సారధ్యంలో అభివృద్ధి చూపుతామని పగడాల హామీ ఇచ్చారు.