కడప: సిమెంటు పైపుల స్థానంలో ఐరన్ పైపులను ఏర్పాటుచేసి సోమశిల వెనుక జలాలను ఒంటిమిట్ట చెరువుకు అందించాలని ఒంటిమిట్ట బీజేపీ మండల అధ్యక్షుడు ఆర్.భాను ప్రకాశ్ రాజు అన్నారు. బుధవారం ఒంటిమిట్టలో మాట్లాడుతూ.. తిరుపతి జిల్లా పద్మావతి విశ్రాంతి గృహంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ను కలిశామన్నారు. నేతలు పాటూరు గంగిరెడ్డి, బాలరాజు శివరాజు, తదితరులు పాల్గొన్నారు.