E.G: రాజమండ్రి సిటీ ప్లానర్(CP) & డిప్యూటీ సిటీ ప్లానర్ (DCP) స్థానిక కోటగుమ్మం, ఏ.వి.ఏ రోడ్డును బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆక్రమణ తొలగింపు చర్యలను సమీక్షించారు. ఈ క్రమంలో అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నేటి నుండి ఆక్రమణ తొలగింపు చర్యలు ప్రారంభమవుతున్నట్లు వెల్లడించారు.