ATP: రాయదుర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం కార్మికుల సమస్య గోడు పట్టించుకోని సూపరింటెండెంట్ అవసరమా అంటూ సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లికార్జున ప్రశ్నించారు. కార్మికుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్న ప్రస్తుత సూపరింటెండెంట్ వైఖరిని మల్లికార్జున తప్పు పట్టారు. అలాగే, సెక్యూరిటీ గార్డ్ రవిని తక్షణమే విధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేశారు.