రతన్ టాటా ఫ్రెండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘శంతను నాయుడు’కి టాటా గ్రూప్‌లో కీలక పదవి దక్కింది. టాటా మోటార్స్‌లో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్‌కు జనరల్ మేనేజర్‌గా శంతను నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆయన తన లింక్డ్ఇన్ పోస్టులో షేర్ చేశారు. కాగా, టాటా ట్రస్ట్‌లో పిన్న వయస్కుడైన శంతను 2018 నుంచి రతన్ టాటాకు అసిస్టెంట్‌గా వ్యవహరించారు.