ఖలిస్థానీ ఉగ్రవాది నిర్జర్ హత్య కేసుపై కెనడా కమిషన్ కీలక వ్యాఖ్యలు చేసింది. నిర్జర్ హత్య కేసుకు విదేశాలతో సంబంధం లేదని వెల్లడించింది. ఆ కోణంలో ఎలాంటి ఆధారాలు లభించలేదని తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలిపింది. కాగా నిర్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల హస్తం ఉందని జస్టిన్ ట్రూడో గతంలో ఆరోపించారు. ట్రూడో ప్రకటన తర్వాత అసత్య ప్రచారాలు వ్యాప్తి జరిగాయని కమిషన్ పేర్కొంది.