PLD: నూజండ్ల మండలంలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. మండలంలోని బుర్రిపాలేం వద్ద ఆర్టీసీ బస్సు తగిలి ఇద్దరు విద్యార్థులు గాయపడి వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారిణి చంద్రకళ వచ్చి విద్యార్థులను పరామర్శించారు.